గ్రామ దీపికల నిరాహార దీక్షకు బీఆర్ఎస్ సంఘీభావం
*ఖమ్మం వాణి, జూన్ 1, తిరుమలాయపాలెం*
తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు గ్రామ దీపికలు చేపట్టిన నిరాహార దీక్షకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావం ప్రకటించింది. తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఆదివారం గ్రామ దీపికలు నిరాహార దీక్ష చేపట్టారు.
![]() |
| దీక్షలో కూర్చున బిఆర్ఎస్ నాయకులు. |
నాయకులువిషయం తెలుసుకున్న మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు భాషబోయిన వీరన్న పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. గ్రామ దీపికలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భాషబోయిన వీరన్న మాట్లాడుతూ, గ్రామీణ అభివృద్ధిలో గ్రామ దీపికల పాత్ర కీలకమని పేర్కొన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామ దీపికల న్యాయమైన హక్కులు, డిమాండ్ల సాధనకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం గ్రామ దీపికల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా స్పందించి డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. లేనిపక్షంలో ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ దీపికలు పాల్గొన్నారు. గ్రామ దీపికల పోరాటానికి పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

Comments
Post a Comment