Posts

Showing posts from May, 2026

"ప్రజా జీవితంలో పారదర్శకత" తిరుమలాయపాలెంలో రగులుతున్న చర్చ"

Image
 సైకిల్ పై సామాన్య వ్యక్తిగా సీడ్స్ వ్యాపారం.   ప్రజా సమస్యలపై పోరాడుతానని పార్టీని ఉద్దరిస్తారని పార్టీలో చేరిక!!  కట్ చేస్తే.. ఖమ్మంలో కోట్లల్లో విలాసవంతమైన భవనాలు.. తిరుమలాయపాలెం, జూన్ 1 ఖమ్మం వాణి ప్రతినిధి: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ప్రజా ప్రతినిధుల ఆదాయ వనరులు, ఆస్తుల పెరుగుదలపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రజల కష్టాల కోసం పుట్టామని చెప్పుకునే పార్టీల్లోని కొందరు నేతలు దొరలకు, అధికారులకు ఊడిగం చేస్తూ కోట్లకు పడగలెత్తారనే విమర్శలు మారుమోగుతున్నాయి. పార్టీలో మండల స్థాయి పీఠాలు ఎక్కిన కొందరి తీరుపై సొంత కార్యకర్తలకే అనుమానాలు ముసురుకుంటున్నాయి. పార్టీని గుండెల్లో పెట్టుకుని పనిచేయాల్సిన వాళ్ళే పార్టీ పునాదులకు గొడ్డలి పెట్టుగా మారారని, ఉద్యోగస్తులతో కుమ్మక్కై సాగిస్తున్న అక్రమ లావాదేవీలను బట్టబయలు చేయాలని పార్టీలోని నిజాయితీపరులే గుసగుసలాడుతున్నారు. చొక్కా లేకుండా తిరిగిన నాయకులు కళ్ళు చెదిరే భవనాలు ఎలా కట్టారని ఊరూవాడా చర్చ నడుస్తోంది. మండలంలోని పలు గ్రామాల్లో కందికి కుటుంబాలు చిట్టీల పేరుతో దోపిడీకి గురవుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పార్టీ ...

గ్రామ దీపికల నిరాహార దీక్షకు బీఆర్ఎస్ సంఘీభావం

Image
*ఖమ్మం వాణి, జూన్ 1, తిరుమలాయపాలెం*  తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు గ్రామ దీపికలు చేపట్టిన నిరాహార దీక్షకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావం ప్రకటించింది. తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఆదివారం గ్రామ దీపికలు నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో కూర్చున బిఆర్ఎస్ నాయకులు.  నాయకులువిషయం తెలుసుకున్న మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు భాషబోయిన వీరన్న పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. గ్రామ దీపికలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భాషబోయిన వీరన్న మాట్లాడుతూ, గ్రామీణ అభివృద్ధిలో గ్రామ దీపికల పాత్ర కీలకమని పేర్కొన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామ దీపికల న్యాయమైన హక్కులు, డిమాండ్ల సాధనకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం గ్రామ దీపికల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా స్పందించి డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. లేనిపక్షంలో ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ దీపికలు పాల్గొన్నారు. గ్రామ దీపికల పోరాటానికి ప...

బీఆర్ఎస్‌లో యువత ఉత్సాహం: అడ్డుగోడలు వద్దు - కొప్పుల ఉపేందర్ రెడ్డి

Image
 ఖమ్మం డెస్క్: మే 31 (ఖమ్మం వాణి) కొప్పుల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో యువత అత్యంత ఉత్సాహంగా పనిచేస్తోందని, వారి ఉత్సాహానికి ఎవరూ అడ్డుగోడలు కట్టవద్దని బీఆర్ఎస్ మండల నాయకులు కొప్పుల ఉపేందర్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బీఆర్ఎస్ యువ నాయకులు పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. "కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు అదే స్ఫూర్తితో యువత పనిచేస్తోంది. వారి ఆలోచనలకు, పనితీరుకు సీనియర్లు సహకరించాలి తప్ప, అడ్డు చెప్పవద్దు" అని ఆయన పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు మళ్లీ గుర్తుచేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత కీలకపాత్ర పోషించి ఇంటింటికీ వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సీనియర్ నాయకులు, యువ నాయకులు కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. "యువత కొత్త ఆలోచనలతో వస్తుంది. వారికి అవకాశం ఇస్తే పార్టీకి తిరుగులేదు. అడ్డ...

ఖమ్మంలో వర్ష సూచన: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 ఖమ్మం డెస్క్: మే31 ఖమ్మం వాణి జిల్లాలో ఈరోజు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయి.  ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 1.  అవసరమైతే తప్ప బయటకు రావద్దు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇంట్లోనే ఉండడం మంచిది. 2.  విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడవద్దు. ఉరుములు పడే ప్రమాదం ఉంది. 3.  లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి. వరద నీరు వచ్చే అవకాశం ఉన్న చోట్ల జాగ్రత్త వహించండి. 4.  రైతులు పొలాల్లో పనులకు వెళ్లేటప్పుడు జాగ్రత్త. పిడుగులు పడే అవకాశం ఉంది. 5.  అత్యవసరమైతే 100 లేదా 108 నెంబర్లకు కాల్ చేయండి. గమనిక: వాతావరణంలో మార్పులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి `ఖమ్మం వాణి` వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి. మీ చుట్టుపక్కల వర్షం పరిస్థితి ఎలా ఉందో కామెంట్‌లో తెలియజేయండి.